బైక్ మీద స్పీడుగా దూసుకుపోవడం చాలామందికి ఇష్టం. అందుకే స్పోర్ట్స్ బైక్ కోసం చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం సుజుకీ కొత్త స్పోర్ట్ బైక్ ని ఇండియాకి తీసుకురాబోతోంది. హయబుసా పేరుతో వస్తోన్న ఈ బైక్ స్పెషాల్టీ ఏంటీ తెలుసా గంటకు 300 కి.మీ వేగంతో దూసుకుపోగలదు.
ఈ బైక్ కి 1450 cc ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ టాప్ స్పీడ్లో 200 hp పవర్ ఇస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ కి TFT మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎనలాగ్ డయ్స్, LED హెడ్ లైట్స్ ఉన్నాయి. ఈ బైక్ కి సుజుకీ డ్రైవ్ మోడ్ సెలక్టర్ (SDMS) కూడా ఉంది. ఇది ప్రీమియర్ సెగ్మెంట్ బైక్ అంటున్నారు ఆటోరంగ నిపుణులు. మరిన్ని ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే బైక్ మార్కెట్లోకి వచ్చాకే తెలుస్తాయి.