Malavika Nair | వ్యోమగామిని కావాలనుకున్నా.. నాన్న కోసం నటిని అయ్యానంటూ హీరోయిన్ కామెంట్స్
Malavika Nair | గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక నాయర్ టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సినిమాలే చేసినా, ప్రతి పాత్రలోనూ తన ప్రతిభను చాటుతూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన బైకర్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Malavika Nair | గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి మాళవిక నాయర్ టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సినిమాలే చేసినా, ప్రతి పాత్రలోనూ తన ప్రతిభను చాటుతూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం శర్వానంద్ సరసన బైకర్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఢిల్లీలో జన్మించి, కొచ్చిలో పెరిగిన మాళవికకు చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా సైన్స్‌లో మంచి ప్రతిభ కనబరిచిన ఆమె, ఒకప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేవారట. చదువుతో పాటు స్విమ్మింగ్‌లో పతకాలు సాధించడంతో పాటు డాన్స్, డ్రాయింగ్ వంటి రంగాల్లోనూ శిక్షణ పొందారు.
సినిమాల్లోకి ఆమె ప్రవేశం వెనుక తండ్రి శశి నాయర్ కీలక పాత్ర పోషించారు. తాను నటుడిగా మారాలన్న కోరిక నెరవేరకపోవడంతో, తన కుమార్తెను వెండితెరపై చూడాలని ఆశపడ్డారు. అలా మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన మాళవికకు దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కథను పంపించడంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ‘ఆనంది’ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నాగశౌర్య సరసన నటించిన ‘కల్యాణ వైభోగమే’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. అలాగే మహానటిలో జమున పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘టాక్సీవాలా’, ‘అన్ని మంచి శకునములే’ వంటి చిత్రాల్లోనూ ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
తన కెరీర్లో ఆసక్తికర అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. ‘విజేత’ సినిమా సమయంలో స్కూటీ నడపడం రాకపోయినా, పాత్ర కోసం కష్టపడి నేర్చుకున్నట్లు తెలిపారు. రెండు మూడు సార్లు పడిపోయినా పట్టుదలతో సాధించానని చెప్పారు. అలాగే మలయాళంలో యాసిడ్ బాధితురాలిగా, తమిళంలో అంధురాలిగా నటించడం తనకు నటనలో కొత్త అనుభవాలను ఇచ్చిందన్నారు.ఇక ప్రస్తుతం శర్వానంద్ – అభిలాష్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’లో హీరోయిన్గా నటిస్తున్న మాళవిక, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

