న్యూఢిల్లీ/చెన్నై, జూన్ 20: సన్ గ్రూప్ చైర్మన్, అన్న కళానిధి మారన్‌కు మాజీ కేంద్ర మంత్రి, డీఎంకే ఎంపీ అయిన తమ్ముడు దయానిధి మారన్ లీగల్ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. మరికొందరికీ పంపిన ఈ తాఖీదుల్లో కళానిధి మోసపూరిత విధానాలకు పాల్పడ్డారని, వేల కోట్ల రూపాయల విలువైన లక్షలాది సన్ షేర్లను అన్యాయంగా తనపేరిట బదిలీ చేసుకున్నారని దయానిధి ఆరోపించిన సంగతీ విదితమే.
అయితే ఈ ఆరోపణలను శుక్రవారం సన్ టీవీ నెట్వర్క్ తోసిపుచ్చింది. అంతా సక్రమంగానే ఉందంటూ స్టాక్ ఎక్సేంజీలకు తెలియజేసింది.