Gold Bond | 25 నుంచి గోల్డ్ బాండ్ ఇష్యూ

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సావరిన్ గోల్డ్ బాండ్స్ తాజా ఇష్యూ అక్టోబర్ 25 నుంచి ప్రారంభంకానుంది. బాండ్లకు ఈ నెల 25 నుంచి దరఖాస్తుచేసుకోవొచ్చని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. ఈ ఇష్యూ ఐదు రోజులపాటు అమల్లో ఉంటుంది. 2021-22 సిరీస్ కింద మొత్తం 10 బాండ్ ఇష్యూల్ని ప్రతిపాదించగా, ఇప్పటివరకూ ఆరు దఫాలు బాండ్లను జారీచేశారు. 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ మరో నాలుగు బాండ్ ఇష్యూలు ఉంటాయి. తాజాగా ప్రారంభంకానున్న సిరీస్-7 అక్టోబర్ 25 నుంచి అక్టోబర్ 29 వరకూ అమలవుతుంది.
నవంబర్ 2న బాండ్ల జారీ…
దరఖాస్తుదార్లకు నవంబర్ 2న బాండ్లు జారీఅవుతాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ బాండ్లు బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, క్లియరింగ్ కార్పొరేషన్, ఎంపికచేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజీల ద్వారా విక్రయిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌బ్యాంక్ ఈ బాండ్లను జారీచేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

