న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్..పాలిస్టర్ చిప్స్, నూలు తయారీ సంస్థ శుభలక్ష్మి పాలిస్టర్స్ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ రూ.1,592 కోట్లు. రిలయన్స్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన రిలయన్స్ పెట్రోలియం రిటైల్ లిమిటెడ్(గతంలో రిలయన్స్ పాలిస్టర్ లిమిటెడ్)…. పాలిస్టర్ బిజినెస్‌ను మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా శుభలక్ష్మి పాలిస్టిర్ను రూ.1,522 కోట్లకు, శుభలక్ష్మి పాలిటెక్ లిమిటెడ్‌ను రూ.70 కోట్లకు కొనుగోలు చేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
విక్రయాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శుభలక్ష్మికి ఇది శుభవార్తలాంటిది. ఈ ఒప్పందానికి కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. దీంతో రిలయన్స్ టెక్స్టైల్ విభాగం మరింత బలోపేతం కానున్నది. ప్రస్తుతం ఎస్పీఎల్..పాలిస్టర్ ఫైబర్, నూలు, టెక్స్టైల్-గ్రేడ్ చిప్స్‌లను తయారు చేస్తున్నది సంస్థ.