బెంగళూరు, డిసెంబర్ 26: దేశీయ ప్రముఖ కిచెన్, కుక్వేర్ తయారీ సంస్థ స్టవ్క్రాఫ్ట్ లిమిటెడ్.. తమ పాపులర్ డిసెంబర్ సేల్ 15వ ఎడిషన్ను తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా రకరకాల కాంబో ఆఫర్లను కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో ప్రెషర్ కుక్కర్-ఇండక్షన్ కుక్టాప్ కాంబో, బ్రేక్ఫాస్ట్ కాంబో (కెటిల్-వాటర్ బాటిల్-పాప్అప్ టోస్టర్), ఎల్పీజీ గ్యాస్ స్టవ్-కుక్వేర్ కాంబో వంటివి ఉన్నాయి. స్టవ్క్రాఫ్ట్ కంపెనీ బ్రాైండ్లెన పీజియన్, గిల్మ ఎక్స్క్లూజివ్ స్టోర్లతోపాటు మాడ్రన్ ట్రేడ్ ఔట్లెట్లు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రిటైల్ స్టోర్లలో కొనుగోలుదారులు ఈ ఆఫర్లను సరసమైన ధరలకే అందుకోవచ్చని శుక్రవారం ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది.