హైదరాబాద్, మే 25: స్విట్జర్లాండ్‌కు చెందిన రైల్వే రోలింగ్ స్టాక్ సంస్థ స్టాడ్లర్ రైల్..ప్రపంచ రైల్వే కోచ్‌ల తయారీలో అగ్రగామి సంస్థ. ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా టెక్నాలజీ పరంగా మార్పులు చేస్తూ..పలు రైల్ కోచ్‌లను తయారు చేస్తున్న సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 30 రైల్వే కోచ్‌ల యూనిట్లు ఉన్నాయి.
తాజాగా తెలంగాణలో మేధా గ్రూపుతో కలిసి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. 1942లో కేవలం ఒక్క ఉద్యోగితో ప్రారంభమైన సంస్థ..ప్రస్తుతం 13 వేల మంది సిబ్బందిని కలిగివున్నది. 1945లో తొలిసారిగా లోకోమోటివ్ బ్యాటరీ-ఎలక్ట్రిక్, డీజిల్ టైప్ రైళ్ళను రూపొందించింది. 1984లో ప్యాసింజర్ రైళ్ళను ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ వెనక్కి తిరిగి చూసుకోలేదు.