న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ లాభాల్లోకి వచ్చింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.42.45 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ప్రయాణికులు పెరగడం, లాజిస్టిక్ విభాగ పనితీరు ఆశాజనకంగా ఉండటం కలిసొచ్చిందని కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.66.78 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.187.06 కోట్ల నుంచి రూ.267.73 కోట్లకు ఎగబాకింది. కరోనా కారణంగా కుదేలైన దేశీయ విమానయాన రంగం గత త్రైమాసికంలో తిరిగి కోలుకున్నదని ఆయన చెప్పారు.