భగ్గుమన్న ఏటీఎఫ్
విమాన ఇంధనం ధర (ఏటీఎఫ్) గురువారం భారీగా పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా ఒక్కసారే ఏటీఎఫ్ కిలో లీటర్ రేటు రూ.19,757.13 లేదా 16.26 శాతం ఎగిసింది. దీంతో ఆల్‌టైమ్ హైని తాకుతూ ఢిల్లీలో వెయ్యి లీటర్ల (కిలో లీటర్) విలువ రూ.1,41,232.87కు చేరింది. ఒక్క లీటర్ రూ.141.23గా ఉన్నట్టు ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలు తెలిపాయి.
- ఆల్‌టైమ్ హైకి విమాన ఇంధనం ధర
- ఒక్కసారే 16.26 శాతం పెంపు
- రూ.141.23కు చేరిన లీటర్ రేటు
న్యూఢిల్లీ, జూన్ 16: విమాన ఇంధనం ధర (ఏటీఎఫ్) గురువారం భారీగా పెరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా ఒక్కసారే ఏటీఎఫ్ కిలో లీటర్ రేటు రూ.19,757.13 లేదా 16.26 శాతం ఎగిసింది. దీంతో ఆల్‌టైమ్ హైని తాకుతూ ఢిల్లీలో వెయ్యి లీటర్ల (కిలో లీటర్) విలువ రూ.1,41,232.87కు చేరింది. ఒక్క లీటర్ రూ.141.23గా ఉన్నట్టు ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలు తెలిపాయి. ముంబైలో రూ.1,40,092.74గా, కోల్‌కతాలో రూ.1,46, 322.23గా, చెన్నైలో రూ.1,46,215.85గా ధరలున్నాయి. స్థానిక పన్నులనుబట్టి ఇవి రాష్ర్టానికో రకంగా ఉంటాయి. కాగా, గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయని, ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 119.16 డాలర్లు పలుకుతున్నదని ఈ సందర్భంగా చమురు మార్కెటింగ్ సంస్థలు వివరించాయి. ఇది దాదాపు దశాబ్ద కాలంలో గరిష్ఠమని పేర్కొన్నాయి.
6 నెలల్లో రెట్టింపైన ధర
విమాన ఇంధనం ధరలు ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే రెట్టింపయ్యాయి. జనవరి 1న ఢిల్లీలో కిలో లీటర్ రూ.67,210.46గా ఉన్నది. ఇప్పుడిది రూ.1,41,232.87కు ఎగబాకింది. దీంతో గడిచిన ఈ ఆరున్నర నెలల్లో ధర రూ.74,022.41 పెరిగినైట్టెంది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 11సార్లు ఏటీఎఫ్ ధరల్ని చమురు విక్రయ సంస్థలు సవరించాయి. ఇందులో ఒక్కసారి మినహా 10సార్లు పెరగడం విశేషం. ఈ నెల 1న ఈ ఏడాదిలోనే తొలిసారిగా ఏటీఎఫ్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. అది కూడా కిలో లీటర్‌పై స్వల్పంగా రూ.1,563.97 లేదా 1.3 శాతం కోత పెట్టాయి. కానీ పెంచిన ప్రతీసారీ సగటున రూ.7వేలపైనే భారం వేయడం గమనార్హం.
టిక్కెట్ రేట్లు 15 శాతమైనా పెరగాలి: స్పైస్‌జెట్
ఏటీఎఫ్ ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో విమాన టిక్కెట్ ధరలూ పెరగాల్సిన అవసరం ఉందని స్పైస్‌జెట్ అభిప్రాయపడింది. కనీసం 10-15 శాతం పెంపు ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో విమానయాన రంగంలో సంస్థల మనుగడ సాధ్యమంటూ స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఈ క్రమంలోనే దేశీయ విమానయాన సంస్థల ముందు టిక్కెట్ ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్యానించారు. నిరుడు జూన్ నుంచి ధరలు 120 శాతం పెరిగాయని గుర్తుచేశారు. పెరుగుతున్న ఇంధనం ధరలు.. ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఖర్చుల్నీ పెంచేస్తున్నాయి. సంస్థ నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ వాటా 40 శాతంగా ఉంటున్నది మరి. మొత్తానికి అసలే కరోనాతో సంక్షోభంలో కూరుకుపోయిన దేశీయ విమానయాన పరిశ్రమకు.. పెరుగుతున్న ఏటీఎఫ్ ధరలు కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- atf
- CMD Ajay Singh
- Spicejet
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

