హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ అత్యధికంగా పరిసరాలను శుభ్రం చేసినందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘స్పెషల్ క్యాంపెన్ 4.0’ పురస్కారం వరించింది.
ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌కు కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఈ అవార్డును అందజేశారు. 2024 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు స్పెషల్ క్యాంపెన్ 4.0లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 216 ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు.