EA Layoffs | లేఆఫ్స్ ప్రకటించిన గేమింగ్ కంపెనీ : 670 మంది ఉద్యోగులపై ఈఏ వేటు
EA Layoffs | అతిపెద్ద గేమింగ్ కంపెనీల్లో ఒకటైన ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (EA) లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఈఏ వెల్లడించింది.
EA Layoffs | అతిపెద్ద గేమింగ్ కంపెనీల్లో ఒకటైన ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (EA) లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగిస్తున్నట్టు ఈఏ వెల్లడించింది. ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్‌లో సమాచారం అందించారు. ఈఏకు ప్రపంచవ్యాప్తంగా 13,400 మంది ఉద్యోగులుండగా, వారిలో 600 మందికి పైగా కొలువులను కోల్పోనున్నారు.
బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ లేఆఫ్స్ సమాచారం వెల్లడించింది. ఉద్యోగులకు కంపెనీ సీఈవో ఆండ్రూ విల్సన్ పంపిన ఈమెయిల్‌ను బ్లాగ్ పోస్ట్ షేర్ చేసింది. వ్యాపార ప్రయోజనాల కోసం కంపెనీ పలు మార్పులు చేపడుతున్నదని, ఈ మార్పుల్లో భాగంగా పలు గేమ్స్‌ను రద్దు చేయడంతో పాటు కంపెనీలో 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ మెయిల్లో సీఈవో స్పష్టం చేశారు.
కంపెనీకి విశేషమైన సేవలందించిన పలువురు ఉద్యోగులకు ఈ సంక్లిష్ట నిర్ణయం బాధాకరమని, కంపెనీ చేపట్టిన మార్పుల్లో ఇది అత్యంత సంక్లిష్ట నిర్ణయమని వివరించారు. కాగా, వచ్చే త్రైమాసికం నాటికి లేఆఫ్స్ పూర్తవుతాయని, బాధిత ఉద్యోగులకు కంపెనీ బాసటగా నిలుస్తుందని, వారికి మరోచోట అవకాశం దక్కేలా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read More :
ED Searches | చైనా బెట్టింగ్, లోన్ యాప్స్‌పై ఈడీ కొరడా : రూ. 123 కోట్ల విలువైన బ్యాంక్ డిపాజిట్స్ ఫ్రీజ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

