హైదరాబాద్, మే 16: సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మరో భారీ ఆర్డర్‌ను దక్కించుకున్నది. ఉత్తర అమెరికాకు చెందిన కస్టమర్‌కు 11.4 మిలియన్ డాలర్ల(రూ.107 కోట్ల) విలువైన 90 వేల 155 ఎంఎం ఫిరంగి గుండ్లను సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఈ ఆర్డర్‌ను వచ్చే పది నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ డిఫెన్స్ తయారీ రంగంలో తనదైన ముద్ర వేయడానికి ఈ ఆర్డర్ ఎంతో కీలకమని కంపెనీ సీఈవో సునీల్ తెలిపారు.