Stocks | 4390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరీ..!
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 6,200 పాయింట్లకు పైగా పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 4,390 పాయింట్ల పతనంతో 72,079 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం ఇంట్రాడే ట్రేడింగ్ లో 22 వేల మార్కు దిగువకు పతనమై 21,281 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయి.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,379 పాయింట్ల నష్టంతో 21,885 పాయింట్ల వద్ద స్థిర పడింది. స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే భారీ నష్టాలతో ముగియడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలు చూస్తుండగానే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30 లక్షల కోట్లు హరించుకుపోయింది.
ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్ ఆరు శాతం నుంచి 15 శాతం మధ్య పతనం అయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12 శాతం వరకు నష్టపోయి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 8 శాతం నష్టంతో స్థిర పడ్డాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 14.33 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 11.3 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 10.25 శాతం నష్టాలతో ముగిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

