అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం!
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,605.44 పాయింట్లు లేదా 2.15 శాతం పడిపోయి 73,123.83 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 546.15 పాయింట్లు లేదా 2.36 శాతం కోల్పోయి 22,600 దగ్గర స్థిరపడింది.
- క్యూ2 ఆర్థిక ఫలితాలు, గల్ఫ్ వార్ కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,605.44 పాయింట్లు లేదా 2.15 శాతం పడిపోయి 73,123.83 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 546.15 పాయింట్లు లేదా 2.36 శాతం కోల్పోయి 22,600 దగ్గర స్థిరపడింది. విజృంభిస్తున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు పెద్ద ఎత్తున ట్రేడింగ్‌ను ప్రభావితం చేశాయి. ఈ వారం కూడా ఇందుకు ఆస్కారం ఉన్నది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయ త్రైమాసికానికి (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు కీలకమని చెప్పవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరితో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ముడి చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇది సహజంగానే భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది.
అలాగే కొంత విరామం తర్వాత ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే బలహీనపడుతున్న రూపాయి మారకం విలువ.. స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి దారితీస్తున్నది. ఇక ఎప్పట్లాగే విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయొచ్చు. అయితే దేశీయ అతిపెద్ద ఐపీవోతో మార్కెట్లలోకి వస్తున్న జియో షేర్లు ఈ వారమే లిస్టింగ్ కానున్నాయి. ఈ అంశం మదుపర్లకు ఒకింత ఉత్సాహాన్నిచ్చే వీలున్నది. కాగా, ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆయిల్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కోవచ్చని మెజారిటీ నిపుణుల అభిప్రాయం. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,100 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 22,900-23,200 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చని కూడా మెజారిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

