మార్కెట్లో రికార్డుల హోరు

- రూ.230 లక్షల కోట్లు దాటిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై, జూన్ 15:ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల్ని పక్కనపెట్టి, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో మంగళశారం స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నెలకొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు పెరిగి కొత్త రికార్డుస్థాయి 52,773 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 57 పాయింట్లు జంప్‌చేసి చరిత్రాత్మక గరిష్ఠం 15,869 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు రికార్డుల పరంపరలో ఇది వరుసగా నాల్గవరోజు. తాజా ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.231.58 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ఆసియన్ పెయింట్స్ 3 శాతంపైగా పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు పెరిగిన షేర్లలో వున్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, పవర్గ్రిడ్లు క్షీణించాయి.
మార్చికల్లా సెన్సెక్స్ 58,500
కొవిడ్-19 సెకండ్‌వేవ్ తీవ్రతలో కూడా భారత ఈక్విటీ మార్కెట్ పటిష్టంగా ర్యాలీ జరిపిందని, వచ్చే ఏడాది మార్చికల్లా సెన్సెక్స్ 58,500 పాయింట్లస్థాయిని చేరుతుందని అంతర్జాతీయ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ జూలియస్బేర్ అంచనావేసింది. కొవిడ్వేవ్తో తాము షాక్ అయ్యామని, ఈ ఉత్పాతానికి స్పందించని మార్కెట్‌ను చూసి కూడా అంతే షాక్ అయినట్లు జూలియన్ బేర్ ఎండీ మార్క్ మాథ్యూస్ చెప్పారు. ఈ ఉదంతం ఇండియా మార్కెట్ బలాన్ని సూచిస్తున్నదని, తాజా కార్పొరేట్ ఫలితాల సీజన్ బావుందని, కార్పొరేట్ లాభాల వృద్ధి సెన్సెక్స్‌ను 58,500 పాయింట్లస్థాయికి నడిపిస్తుందన్న అంచనాల్ని ఆయన వ్యక్తంచేశారు. జొమాటో, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్ వంటి ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల ఐపీఓల ద్వారా ఇండియా మరింతగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించగలుగుతుందని మాథ్యూస్ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

