Gold Exchange | త్వరలో బంగారం క్రయ విక్రయాలకు గోల్డ్ ఎక్స్చేంజ్ ఏర్పాటు కానున్నది. ఈ మేరకు స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. గోల్డ్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరవరల్లో పారదర్శకత తీసుకు రావడానికి ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రూపంలో ఈ ట్రేడింగ్ జరుగనున్నది.
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్)లను సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తామని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఏదేనీ స్టాక్ ఎక్స్చేంజ్లో.. ఈజీఆర్‌ను సెపరేట్ సెగ్మెంట్‌గా ప్రారంభించొచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్లో ఈజీఆర్ ట్రేడింగ్, భౌతికంగా బంగారం డెలివరీ ఉంటుంది. ఇది భారత దేశంలో వైబ్రెంట్ గోల్డ్ ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తుందని సెబీ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఈజీఆర్‌ల క్రయ, విక్రయాలకు గోల్డ్ ఎక్స్చేంజ్ నేషనల్ ప్లాట్‌ఫామ్‌గా అవతరిస్తుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా గోల్డ్ ప్రైసింగ్ స్ట్రక్చర్‌ను క్రియేట్ చేస్తుంది. దేశంలో బంగారం విక్రయాలను ప్రమాణీకరిస్తుంది.