SEBI on IIFL | రెండేండ్ల వరకూ ఆ పని చేయొద్దు.. ఐఐఎఫ్‌ఎల్‌పై సెబీ నిషేధం.. ఎందుకంటే?!
SEBI on IIFL | ఐఐఎఫ్‌ఎల్‌పై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఈ మేరకు రెండేండ్ల వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని తేల్చి చెప్పింది.
SEBI on IIFL | అకౌంట్స్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన ఇండియన్ ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్ఎల్) సెక్యూరిటీస్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెబీ.. షాక్ ఇచ్చింది. వచ్చే రెండేండ్ల వరకు కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని ఆంక్షలు విధించింది. ఖాతాల నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా ఐఐఎఫ్ఎల్ వ్యవహరించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఖాతాదారుల నిధులను సంస్థ నిధులతో కలపడం, డెబిట్ ఖాతాల పరిష్కారానికి క్రెడిట్ బ్యాలెన్స్ ఖాతాలను వాడుకోవడం, సంస్థ వ్యాపార నిధుల సమస్య పరిష్కారానికి క్రెడిట్ ఖాతాల వినియోగం వంటి చర్యలకు ఐఐఎఫ్ఎల్ పాల్పడింది. ఇది 1993లో తాము జారీ చేసిన సర్క్యులర్‌కు వ్యతిరేకం అని సెబీ వెల్లడించింది. 2011 ఏప్రిల్ నుంచి 2017 మార్చి నెలాఖరు వరకు ఐఐఎఫ్ఎల్ ఈ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించామని సెబీ పేర్కొంది. ఈ అవకతవకల వల్ల ఐఐఎఫ్ఎల్ దివాళా తీయకున్నా.. మార్కెట్ల నియంత్రణ సంస్థగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సెబీ వివరించింది.
తనకు తాను అతిపెద్ద బ్రోకరేజీ సంస్థగా ప్రచారం చేసుకుంటూ వేలాది మంది రిటైల్ ఖాతాదారులతోపాటు కొన్ని సంస్థలకూ సేవలు అందిస్తామని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ చెబుతున్నదని సెబీ పేర్కొంది. నిబంధనలు పాటించకుండా ఖాతాల నిర్వహణలో అవకతవకలకు పాల్పడటంతోపాటు నిధులు దుర్వినియోగం చేసిందని తెలిపింది. ఇటువంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించవచ్చునని వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ban
- Business news
- iifl
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

