SBI Card | ఎస్బీఐ యూజర్లకు షాక్.. ఈఎంఐ పెడితే తడిచిమోపెడు కావాల్సిందే !
SBI Card | ఎస్బీఐ కార్డు బిల్లులను ఈఎంఐలుగా మార్చుకుంటే వాటిపై ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ.99 చెల్లించాలని ఎస్బీఐ తెలిపింది.

SBI Card | మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారా.. ఆ బిల్లులను ఈఎంఐలుగా మార్చి చెల్లిస్తున్నారా.. అయితే.. ఆ ఈఎంఐలు త్వరలో మీకు భారం కానున్నాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి క్రెడిట్ కార్డుల బిల్లుల ఈఎంఐలకు ప్రాసెసింగ్ ఫీజు రూపేణా రూ.99 వసూలు చేస్తామని ఎస్బీఐ తెలిపింది. వీటికి పన్నులు అదనం అని పేర్కొంటూ.. క్రెడిట్ ఖాతాదారులకు ఈ-మెయిల్ మెసేజ్ పంపింది.
అన్ని మర్చంట్ ఔట్లెట్లు, ఈ-కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల్లో జరిపే ఈఎంఐ లావాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసిన బిల్లులను ఈఎంఐలుగా మార్చుకున్న వారికే ఈ ఫీజు వర్తిస్తుంది. అంటే ఈఎంఐ లావాదేవీ మొత్తంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో రూ.99 అదనంగా చెల్లించాలి. అది మీ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లో కలిపి వస్తుంది. ఒకవేళ ఈఎంఐ ఆప్షన్‌ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం సదరు ప్రాసెసింగ్ ఫీజు తిరిగి చెల్లిస్తామని ఎస్బీఐ వివరించింది.
అదే సమయంలో ఈఎంఐతోపాటు వడ్డించే ప్రాసెసింగ్ ఫీజుకు, కార్డ్ వడ్డీ చార్జీకి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. కొన్ని సంస్థలు తమ వద్ద కొనే వస్తువులకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీలపై డిస్కౌంట్లతోపాటు జీరోకాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కల్పిస్తుంది. అటువంటి లావాదేవీలు-ఈఎంఐలకు ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎస్బీఐ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

