న్యూఢిల్లీ: ఇస్లామిక్ సంస్థ తబ్లిగీ జమాత్‌పై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదానికి తబ్లిగీ ఒక మార్గమని ఆ సంస్థను ఉద్దేశించి ఆ దేశం వ్యాఖ్యానించింది. తబ్లిగీ జమాత్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను హెచ్చరించాలని మసీదులలోని బోధకులను సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం కోరింది.