హైదరాబాద్, అక్టోబర్ 7 : శాటిలైట్ కమ్యూనికేషన్స్, రక్షణ ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామి సంస్థయైన అవాంటెల్ లిమిటెడ్..ఏరోస్పేస్, రక్షణ సాంకేతికల అభివృద్ధిలో తన సామర్థ్యాలను పెంపొందించడానికి హైదరాబాద్‌లో రెండో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రంలో సాఫ్ట్వేర్-డిఫైన్డ్ రేడియోలు, రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇంటిగ్రేషన్ డిజైన్, అభివృద్ధి, తయారీపై దృష్టి సారించనున్నారు.
ఈ సందర్భంగా అవాంటెల్ డైరెక్టర్ సిద్దార్థ అబ్బూరి మాట్లాడుతూ.. రూ.56 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటైన ఈ సెంటర్‌తో కంపెనీ బహుళ రంగాలకు విస్తరించినట్టు అయిందని, దీంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,000కి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.