న్యూఢిల్లీ, మార్చి 27: హెల్త్‌కేర్ ఇండస్ట్రీ బాడీ నాథెల్త్ నూతన ప్రెసిడెంట్‌గా అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి నియమితులయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ఆమె ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ చైర్పర్సన్ అమీరా షా స్థానాన్ని సంగీతా రెడ్డి భర్తీ చేయనున్నారు.