Samsung Galaxy M15 5G | శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గెలాక్సీ ఎం15 5జీ.. ఇవీ డిటెయిల్స్..!
Samsung Galaxy M15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ (Samsung Galaxy M15 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Samsung Galaxy M15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ (Samsung Galaxy M15 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత ఏప్రిల్ ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ మాదిరిగానే ఉంటుందీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్ తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ (Samsung M15 5G Prime Edition) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,499 పలుకుతుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ, స్టోన్ గ్రే కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ (Samsung M15 5G Prime Edition) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.0 వర్షన్ పై పని చేస్తుంది. నాలుగేండ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామని శాంసంగ్ వెల్లడించింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
వాయిస్ కాల్ క్లారిటీ కోసం ‘నాక్స్ సెక్యూరిటీ, క్విక్ షేర్ ఫీచర్స్, వాయిస్ ఫోకస్’ వంటి ఫీచర్లతో వస్తోంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

