Samsung Galaxy F54 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి త్వరలో తన గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. ఇన్-హౌస్ ఎక్స్‌నోస్ 1380 ఎస్వోసీ చిప్ సెట్‌తో వస్తున్నది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.
108-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సర్ కలిగి ఉంటుంది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.35,999 ఉండొచ్చునని సమాచారం. గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ ఆండ్రాయిడ్-13బేస్డ్ వన్ యూఐ5 వర్షన్ మీద పని చేస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుందని భావిస్తున్నారు. 108-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్డ్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉండొచ్చునని అంచనా. గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.
గత మార్చిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.38,999, టాప్ హై ఎండ్ ఫోన్ 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.40,999 లకు లభిస్తున్నది.