Samsung Galaxy F15 5G | శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 జీ ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషికేషన్స్..!
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ స్క్రీన్‌తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్వోసీతో వచ్చింది. మూడు వేర్వు కలర్ ఆప్షన్లతోపాటు రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యంతో వచ్చింది.శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ (Samsung Galaxy F15 5G) 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,499లకు లభిస్తుంది. యాష్ బ్లాక్, గ్రోవీ వయోలెట్, జాజీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌ల్లో సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 5 వర్షన్‌పై పని చేస్తుంది. ఐదేండ్లు సెక్యూరిటీ అప్డేట్స్, నాలుగేండ్లు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తుంది శాంసంగ్. 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ (Samsung Galaxy F15 5G) ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగా పిక్సె్ల్ షూటర్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్లో ఒక టిగా బైట్స్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ వై-ఫై 02.11 ఏ/ బీ / జీ / ఎన్ / ఏసీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్, యాక్సెలరో మీటర్, గైరో సెన్సర్, జియో మ్యాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్లు ఉంటాయి. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్, 25 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం కలిగి ఉంటుందని శాంసంగ్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

