జీఎస్టీ వసూళ్లు రూ.92,849 కోట్లు..

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో 92,849 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ వరకు ఆ మొత్తం జీఎస్టీగా వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి ఇటీవల ప్రతి నెల లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూల్ అయ్యేది. క ఆనీ ఇటీవల పన్నుదారులకు కొన్ని రాయితీలు ప్రకటించడం వల్ల ఈ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని రిలీఫ్ చర్యలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాదితో పోలిస్తే జూన్ నెలలో ఈసారి రెండు శాతం వసూళ్లు పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది.
గత 8 నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో తక్కువ సంఖ్యలో వసూళ్లు జరిగాయి. మే నెలలో ఎక్కువ శాతం రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్న కారణంగా వసూళ్లు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మే నెలలో 3.99 కోట్ల ఈ-బిల్లులు నమోదు అయినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో 5.88 కోట్లు ఈబిల్ రూపంలో చెల్లించగా.. మేలో అది 30 శాతం తగ్గినట్లు తేలింది. కానీ మళ్లీ జూన్ నెలలో ఈ-బిల్లులు 5.5 కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

