2000 Note | 2000 నోటు ముద్రణ నిలిపేశాం.. స్పష్టం చేసిన కేంద్రం!
2000 Note | 2018తో పోలిస్తే 2000 నోట్ల చలామణి తగ్గిందని, ఇక ముద్రించబోమని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు.

2000 Note | సరిగ్గా ఐదేండ్ల క్రితం బ్లాక్‌మనీ ఆట కట్టించేందుకు.. ఉగ్రవాదులకు నిధుల అందకుండా చూసేందుకు 2016 నవంబర్ 8 అర్ధరాత్రి అర్ధంతరంగా కేంద్రం పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసేసింది. వాటి స్థానే కొత్తగా రూ.2000, రూ.500 నోట్లు తీసుకొచ్చింది. తదుపరి రూ.200 విలువ గల నోట్లను కూడా తెచ్చింది. కానీ 1000/500 విలువ గల పెద్దనోట్ల స్థానే తీసుకొచ్చిన 2000 విలువైన నోట్ల చలామణి తగ్గుముఖం పట్టింది. ఈ సంగతి స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. అంతే కాదు 2018-19 తర్వాత కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసినట్లు కూడా తేల్చేశారు.
2019లో 3.27% చలామణి.. 2021లో ఇలా
2018 మార్చి నాటికి మొత్తం చలామణీలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్లు 3.27 శాతం అయితే, ఇప్పుడు (నవంబర్ 2021) 1.75 శాతానికి పడిపోయిందని మంగళవారం రాజ్యసభలో సభ్యుల రాతపూర్వక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పంకజ్ చౌదరి తెలిపారు. 2018 మార్చి 336.3 కోట్ల రూ.2000 నోట్లు చలామణిలో ఉంటే, ఇప్పుడవి 223.3 కోట్లకు పడిపోయాయన్నారు. ఆర్బీఐతో సంప్రదించిన తర్వాత నగదు లావాదేవీలపై ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకునోట్లను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కరెన్సీకి ఇలా డిమాండ్
ఆర్థిక వృద్ధిరేటు, వడ్డీరేట్ల స్థాయితోపాటు పలు సూక్ష్మ ఆర్థిక అంశాలపై కరెన్సీకి డిమాండ్ ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి వల్ల కరెన్సీకి డిమాండ్ వచ్చిందన్నారు. కరెన్సీ చలామణిలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2019-20లో జీడీపీలో 12 శాతం కరెన్సీ చలామణి జరిగితే, 2020-21లో 14.5 శాతానికి పెరిగింది. కానీ నవంబర్‌లో 7.9 శాతానికి పడిపోయిందని పంకజ్ చౌదరి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

