Effect of Rs.2000 | ఏడేండ్ల క్రితం 2016 నవంబర్ 8వ తేదీ భారత దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని నరేంద్రమోదీ పాత పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 2023 మే 23న రూ.2000 విలువైన నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏడేండ్ల క్రితం మాదిరే తాజాగా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థిక రంగంపై మాత్రమే కాక, సామాజిక, రాజకీయ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. స్వల్ప కాలికం నుంచి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
2016లో రూ.125 లక్షల కోట్ల (2000 బిలియన్ డాలర్లు) విలువైన పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు అయ్యాయి. సమాంతర ఆర్థిక వ్యవస్థలో సుమారు రూ.28 లక్షల కోట్ల కరెన్సీ (దాదాపు 23 శాతం) పనికి రాకుండా పోయాయి. ఈ మొత్తంలో భారీ మొత్తం రియాల్టీ, బంగారం, క్యాష్ రూపేణా నిలిచాయి.
2016 నుంచి ఇప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.2000 విలువైన నోట్ల విలువ మొత్తం రూ.10.35 లక్షల కోట్లు. ఈ మొత్తం కరెన్సీ ఒక్కసారిగా చలామణిలో నుంచి ఉపసంహరించడం వల్ల దాదాపు ప్రతి రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ రియాల్టీ, బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు పెద్ద నోట్లన్నీ సగానికి పైగా రియాల్టీ రంగంలో పెట్టుబడులుగా ఉంటాయి. మిగతా 50 శాతం కరెన్సీ బంగారం, నగదుల్లో ప్రజానీకం వద్ద ఉంటుంది.
నాడు (పాత పెద్దనోట్లు రూ.1000, రూ.500 కలిపి) 68 శాతం క్యాష్ చిత్తు కాగితాలయ్యాయి. ఇప్పుడు దాదాపు అదే మొత్తంలో రూ.2000 నోట్లు చిత్తు కాగితాలుగా మారనున్నాయి.
రూ.3 లక్షల కోట్లు (45 బిలియన్ డాలర్లు) నల్లధనం చెల్లుబాటవుతుందని అంచనా వేశారు. ఇది వందకి పై చిలుకు దేశాల జీడీపీతో సమానం.
ఫైనాన్సియల్ లేదా బిజినెస్ రంగాలపై ప్రభావం : హవాలా మార్గాల్లో దాచి పెట్టిన బ్లాక్ మనీ.. చెలామణిలోకి తెచ్చుకుంటారు.
పన్ను చెల్లింపుదారుడు కష్టపడి సంపాదించిన మొత్తం డిపాజిట్ చేసి, విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల ముందు బారులు తీరాల్సి ఉంటుంది.
చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల లావాదేవీలు దెబ్బతినడంతో ఆ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది.
జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగాల బిజినెస్ పూర్తిగా దెబ్బ తింటుంది.
రియాల్టీ రంగ ధరలు పడిపోతాయి. ఇండ్ల క్రయ విక్రయాలు తగ్గిపోతాయి.
సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ నష్టపోతుంది.
బ్యాంకులకు, బ్యాంకు అధికారులకు కష్టకాలం. డిపాజిట్ల రూపేణా నగదు వరద పోటెత్తుతుంది.
పాత పెద్ద నోట్ల రద్దు పెద్ద స్కాం అని ప్రధాన రాజకీయ పార్టీల ఆరోపణ.
ప్రదర్శనలు, బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరడంతో సాధారణ ప్రజల జీవనం అస్తవ్యస్తం.
నగదు చెల్లింపుల్లో జాప్యంతో తక్కువ ఆదాయ కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం.
సమాజంలో బ్యాంకర్లు, క్యాషియర్లకు లభించనున్న గౌరవం
గ్యాంబ్లింగ్ కు పెద్ద దెబ్బ.. ఉగ్రవాద నెట్ వర్క్ లకు, డ్రగ్ మాఫియాకు చరమ గీతం.
నగదు వినియోగం పడిపోవడంతో జీడీపై ప్రభావం
పరోక్ష పన్ను వసూళ్లు తగ్గుదల
అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంలోకి కార్మికుల వలస
ఆదాయం పన్ను రేట్లు తగ్గుదల
రుణాలు చౌక.. హౌసింగ్ చౌక.
బాండ్ల ధరలు పెరుగుదల.. రియాల్టీ ధరల పతనం.
ఈక్విటీ మార్కెట్లకు 12 నెలల్లో లబ్ధి.
ద్రవ్యలోటు తగ్గే చాన్స్. కరెన్సీ మరింత బలోపేతం.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం.
వ్యాపార వేత్తలకు చౌకగా రుణాలు
పాత పెద్ద నోట్లు రూ.1000, రూ.500 స్థానే వచ్చిన రూ.2000 నోట్లతో ముడుపుల చెల్లింపులు తేలిక.. ఇప్పుడు అలా ముడుపులు చెల్లించిన మనీ వెలికితీత.
బంగారం రూపంలో ముడుపుల చెల్లింపులు. అసంఘటిత రంగంలో ఉద్యోగాల ఉద్వాసన.
RBI on Rs.2000| రూ.2000 నోటును ఉపంహరించుకున్న ఆర్బీఐ
Rs.2000 Note Circulation | తగ్గుతున్న రూ.2000 నోటు సర్క్యులేషన్.. వెల్లడించిన ఆర్బీఐ
2000 Note | 2000 నోటు ముద్రణ నిలిపేశాం.. స్పష్టం చేసిన కేంద్రం!
రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!