Royal Enfield | ప్రపంచ అగ్రశ్రేణి టూ వీలర్ జెయింట్ రాయల్ ఎన్ఫీల్డ్.. తదుపరి బైక్ సూపర్ మీటోర్-650 వెలుగు చూసింది. రాయల్ ఎన్ఫీల్డ్లో 650 సీసీ సామర్థ్యం గల బైక్‌ల్లో ఇది మూడవది. ఇంతకుముందు ఇంటర్‌సెప్టర్-650, కాంటినెంటల్ జీటీ-650 రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చింది. మిలాన్‌లో జరిగిన ఈఐసీఎంఏ-2022 ఎగ్జిబిషన్లో రాయల్ ఎన్ఫీల్డ్.. సూపర్ మీటోర్ను ఆవిష్కరించింది.
ఇంతకుముందు రెండు బైక్‌ల్లో వాడిన 648 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్నే ప్రీమియం క్రూయిజర్ బైక్ సూపర్ మీటోర్-650లోనూ వినియోగిస్తున్నారు. మీటోర్ -350 బైక్ మాదిరిగానే సూపర్ మీటోర్ 650 బైక్ క్రూయిజర్ డిజైన్ కిగి ఉంటుంది. కానీ ఈ డిజైన్‌లో ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ – 650 బైక్స్ రూపుదిద్దుకోలేదు.
పూర్తిగా పర్యాటక అనుకూలంగా ఉండే సూపర్ మీటోర్ 650 బైక్ ఐదు రంగుల్లో వస్తుంది. ఆస్ట్రల్ బ్లాక్, ఆస్ట్రల్ బ్లూ, ఆస్ట్రల్ గ్రీన్, ఇంటర్సెల్లార్ గ్రే, గ్రీన్ రంగుల్లో సూపర్ మీటోర్- 650 బైక్ పొందొచ్చు. సెలెస్టియల్ రెడ్, బ్లూ2 కలర్స్‌లో కూడా లభిస్తుంది.
భారత్ మార్కెట్లో దీని ధర ఎంత అన్నది ఖరారు కాలేదు. త్వరలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌ల ధర కంటే ఎక్కువగానే సూపర్ మీటోర్ 650 బైక్ ధర ఉంటుందని చెబుతున్నారు.
సూపర్ మీటోర్- 650 క్రూయిజర్ బైక్ ప్రధానంగా రైడింగ్ పొజిషన్లో ఉంటుంది. 700 సీసీ సెగ్మెంట్లో ఏర్పాటు చేశారు. పూర్తిగా పుట్ ఫార్వర్డ్ ఫుట్ కంట్రోల్, లో స్కాల్లోప్డ్ సీట్స్, వైడ్ పుల్ బ్యాక్ హ్యాండిల్ బార్స్ తదితర ఫీచర్లతో వస్తుంది.
సూపర్ మీటోర్ -650 బైక్ ఇంజిన్ 7,250ఆర్పీఎం వద్ద 47 పీఎస్, 5,650 ఆర్పీఎం వద్ద 52 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. బార్ అండ్ మిర్రర్స్, డీలక్స్ ఫుట్ పెగ్స్, సోలో ఫినిషర్, ఎల్ఈడీ ఇండికేటర్లు, మెషిన్డ్ వీల్స్, డీలక్స్ టూరింగ్ డ్యూయల్ సీట్, టూరింగ్ వైండ్ స్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్ రెస్ట్, టూరింగ్ హ్యాండిల్ బార్, లాంగ్హౌల్ పన్నియర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ 6స్పీడ్ గేర్ బ్యాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్ల పెట్రోల్.