చెన్నై/హైదరాబాద్, ఆగస్టు 24: రాయల్ ఎన్ఫీల్డ్ మరో మోడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. యువతే లక్ష్యంగా విడుదలైన ఈ 350 సీసీ హంటర్ బైక్ ప్రారంభ ధర రూ.1,49,900. గరిష్ఠ ధర రూ.1,68,900గా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబాద్/చెన్నైలకు సంబంధించినవి. తెలంగాణలో ఉన్న 75 టచ్ పాయింట్లలో ఈ బైక్ లభిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ సీసీవో యుద్విందర్ సింగ్ తెలిపారు.