Reliance | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:రిలయన్స్ గ్రూపునకు చెందిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తాజాగా స్పోర్ట్స్ హైడ్రేషన్ డ్రింక్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి స్పిన్నర్ పేరుతో ఈ డ్రింక్‌లను మార్కెట్లోకి విడుదల ఏసింది. ఇప్పటికే కంపా కొలా పేరుతో కూల్‌డ్రింక్స్‌ను విక్రయిస్తున్న సంస్థ తాజాగా విడుదల చేసిన 150 ఎంఎల్ సింగిల్-సర్వ్ బాటిల్ కలిగిన స్పోర్ట్స్ డ్రింక్ ధర రూ.10గా నిర్ణయించింది. ఇతర పోటీ సంస్థలైన పెప్సీకో, కోక-కోలాకు చెందిన స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే తక్కువ ధరతో విడుదల చేయడం విశేషం.
టాటా బోయింగ్ 300వ ఫ్యూజ్‌లేజ్
హైదరాబాద్, ఫిబ్రవరి 10: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ నుంచి ఏహెచ్-64 అపాచీ అటాక్ హెలిక్యాప్టర్ కోసం మరో బాడీని డెలివరీ చేసింది. ఈ ఫ్యూజ్లెజ్ 300వది కావడం విశేషం. ఇక ఈ హెలిక్యాప్టర్లను అమెరికా ఆర్మీతోపాటు భారత ఆర్మీ కూడా వినియోగిస్తున్నది. దేశీయ ఎయిర్‌పోర్స్ 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలిక్యాప్టర్లను కలిగివున్నది. బోయింగ్, టీఏఎస్ఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో 900 మంది ఇంజినీర్లు, టెక్నిషన్లు ఉన్నారు. 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి న ఈ యూనిట్లో తయారైన ఉత్పత్తులు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.