Jio | ఏజీఆర్లో జియో టాప్.. 10.21 శాతం పుంజుకున్న సర్దుబాటు స్థూల ఆదాయం
రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది.
న్యూఢిల్లీ, జూలై 4: రిలయన్స్ జియో అత్యధిక సర్దుబాటు స్థూల ఆదాయాన్ని (ఏజీఆర్) ప్రకటించింది. జనవరి-మార్చిలో రూ.25,330.97 కోట్లుగా ఉన్నది. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 10.21 శాతం పుంజుకున్నది. నాడు రూ.22,985 కోట్లేనని గురువారం టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్ తెలియజేసింది.
ఇక భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 13.25 శాతం ఎగిసి రూ.20,951.91 కోట్లుగా నమోదైంది. నిరుడు రూ.15,500.36 కోట్లే. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ సైతం రూ.7,210.63 కోట్ల నుంచి రూ.7,370. 75 కోట్లకు పెరిగింది.
అయితే ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఏజీఆర్లు 4.41 శాతం, 13.78 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఎన్ఎల్ ఏజీఆర్ ఈ జనవరి-మార్చిలో 1,991.61 కోట్లుగా ఉంటే, ఎంటీఎన్ఎల్ది రూ.156.61 కోట్లే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

