Jio Prepaid | యూజర్ల కోసం జియో వార్షిక సబ్ స్క్రిప్షన్లు ప్లాన్లు.. ఇవీ డిటైల్స్.. !
Reliance Jio | ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ టారిఫ్‌లు తీసుకొచ్చింది. వీటితో అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి పాపులర్ ఓటీటీ సర్వీసులు పొందవచ్చు.
Reliance Jio Prepaid | ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ టారిఫ్‌లు తీసుకొచ్చింది. వీటితో నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 వంటి పాపులర్ ఓటీటీ సర్వీసులు పొందవచ్చు. జియో కొత్తగా రూ.2546 నుంచి రూ.3,662 టారిఫ్ లతో వేర్వేరు ప్లాన్లు ఆఫర్ చేసింది. తాజాగా తెచ్చిన ఈ టారిఫ్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చు.
రూ.3,227 ప్రీపెయిడ్ టారిఫ్ ఎంచుకుంటే 365 రోజులూ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా యాప్ కూడా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ అక్కర్లేదనుకుంటే.. సోనీ లివ్, జీ5 సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.
రూ.3,662 టారిఫ్ ఎంచుకున్న యూజర్లకు ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతోపాటు సోనీ లివ్, జీ5 తోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సేవలు పొందొచ్చు.
రూ.3,226 టారిఫ్ కింద సోనీ లివ్ తోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి. జియో టీవీ ద్వారా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సేవలు పొందొచ్చు.
రూ.3,225 ప్లాన్ కింద జీ5తోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఓటీటీ సేవలు పొందొచ్చు. అదనంగా సోనీలివ్ ప్లాట్ ఫామ్ ఓటీటీ సేవలను వీక్షించవచ్చు.
రూ.3178 ప్లాన్‌తో డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్లస్ జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు పొందవచ్చు. డిస్నీ + హాట్ స్టార్ సేవలు పొందడానికి జియో మొబైల్ నంబర్ ద్వారా సరైన ప్లాన్ టారిఫ్ రీచార్జీ చేయడంతోపాటు డిస్నీ + హాట్ స్టార్ యాప్‌లో సైన్ చేయాలి.
వీటితోపాటు ఏడాది గడువుతో రూ.2,545 టారిఫ్ తెచ్చింది. ఇందులో ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు ఉండవు గానీ, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా సేవలు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

