న్యూఢిల్లీ, డిసెంబర్ 16: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్..విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం గ్లోబల్ హెల్త్‌కేర్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ తీసుకున్నవారు కేవలం భారత్‌లో నే కాకుండా అంతర్జాతీయంగా పనిచేయడం విశేషం. అంతర్జాతీయ దవాఖానల్లో క్యాన్సర్, బైపాస్ సర్జరీలకు వర్తించనున్నదని పేర్కొంది. ఈ పాలసీ పరిధిలోకి రవాణా, వసతి, వీసా, సహాయ సేవలతోపాటు అత్యవసర సేవలైన పాస్‌పోర్ట్ పోతే లేదా అత్యవసర నగదు కూడా మిలియన్ డాలర్ల వరకు కవరేజ్ కల్పిస్తున్నది. అలాగే అవయవ దాతల కోసం విమాన చార్జీలు కూడా భరించనున్నది.