Reliance-Aramco | రిలయన్స్‌తో ఆరామ్ డీల్ రద్దుకు కారణాలివేనా?!
Reliance-Aramco | సౌదీ ఆరామ్కోతో రిలయన్స్ డీల మధ్యలోనే నిలిచిపోవడానికి విలువ ఖరారుపై ప్రతిష్టంభనే కారణమని తెలుస్తోంది.

Reliance-Aramco | రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ ఆరామ్కో మధ్య వాటాల విక్రయ ఒప్పందం చర్చలు మధ్యలోనే విఫలమయ్యాయి. రిలయన్స్ విలువ ఖరారుపైనే ఆందోళన వ్యక్తం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలు వెలువరించే పెట్రోల్ వినియోగం నుంచి పక్కకు తప్పుకుంటున్న దశలో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్ విలువ ఎంతన్న విషయం పైనే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పంద చర్చలు నిలిచిపోయాయని సమాచారం. 2019 అంచనాతో పోలిస్తే రిలయన్స్ 15 బిలియన్ డాలర్లు తగ్గించుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆరామ్కోతో వాటాల విక్రయ ఒప్పందం మధ్యలోనే ఆగిపోవడంతో రిలయన్స్ తన వ్యూహం మార్చుకున్నట్లు తెలియ వచ్చింది. అధిక లాభాలు సంపాదించుకునేందుకు.. కెమికల్స్ తయారీలో స్పెషాలిటీ గల పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై రిలయన్స్ ఇప్పుడు ఫోకస్ చేస్తోంది.
2019లో ఆరామ్ కో ఇలా
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ముడి చమురు ఎగుమతి దారైన ఆరామ్ కో.. రిలయన్స్‌లోని ఆయిల్ 2 కెమికల్స్ బిజినెస్‌లో 15 బిలియన్ డాలర్ల విలువ చేసే 20 శాతం వాటా కొనుగోలుకు 2019లో నాన్‌బైండింగ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. కానీ రెండేండ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం డీల్‌ను తిరిగి లెక్క గడతామని గతవారం రెండు సంస్థలు ప్రకటించాయి.
దిశ మారుతున్న గ్లోబల్ ఎనర్జీ ఇండస్ట్రీ
భూతాపం నివారణ వైపు గ్లోబల్ ఎనర్జీ ఇండస్ట్రీ దిశ మార్చుకుంటున్న తరుణమిది.. అంటే శిలాజ ఇంధనాలైన పెట్రోల్ నుంచి హరిత అనుకూల సంప్రదాయతేతర (renewable) ఇంధన వనరుల దిశగా ప్రపంచ ఇంధన పరిశ్రమ అడుగులేస్తున్నది. ఇటీవల గ్లాస్కోలో జరిగిన కాప్ 26 సదస్సులో పెట్రోల్ వాడకం తగ్గింపుపై సభ్య దేశాలు చర్చలు జరిపిన తర్వాత పెట్రోల్ రిఫైనింగ్ అండ్ పెట్రో కెమికల్ సంస్థల ఆస్తుల విలువ పడిపోయింది.
10 శాతానికి పైగా రిలయన్స్ ఓ2సీ బిజినెస్ విలువ కోత
2019లో రిలయన్స్ ఆయిల్ 2 కెమికల్ బిజినెస్ విలువ 75 బిలియన్ల డాలర్లు అని ఆ సంస్థ సీనియర్ అధికారుల కథనం. తాజాగా మారిన పరిస్థితుల్లో రిలయన్స్ ఆయిల్ 2 కెమికల్ బిజినెస్ విలువను కన్సల్టెంట్స్ గణనీయంగా అంటే 10శాతానికి పైగా తగ్గించేశారని ఆ అధికారులు చెబుతున్నారు. రిలయన్స్ తన సంస్థ విలువపై గోల్డ్మన్సాచెస్ను, ఆరామ్ కో ప్రతినిధులు సిటీ గ్రూప్ బ్యాంకు సాయం కోరారు. కానీ దీనిపై రెండు బ్యాంకులు స్పందించేందుకు నిరాకరించాయి.
రిలయన్స్ ఆయిల్ బిజినెస్‌పై కన్సల్టెంట్స్ ఇలా
రిలయన్స్ ఎనర్జీ బిజినెస్ విలువను 80 బిలియన్ డాలర్ల నుంచి 70 బిలియన్ డాలర్లకు తగ్గించాలని జెఫరీస్ ప్రతిపాదించింది. మరోవైపు కొటక్ ఇన్స్ట్యూషనల్ ఈక్విటీస్ 61 బిలియన్ డాలర్లకు కుదించింది. బెర్న్‌స్టైన్ మాత్రం 69 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- reliance
- saudi aram co
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

