Realme Narzo 70 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 ప్రో (Realme Narzo 70 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్, 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా, 6.7 అంగుళాల డిస్ ప్లే, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
రియల్మీ నార్జో 70 ప్రో (Realme Narzo 70 Pro) ఫోన్ రెండు రంగుల ఆప్షన్లు- గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 పలుకుతుంది. 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ డాట్ కామ్, రియల్మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తారు. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి రూ.2,299 విలువ గల రియల్మీ టీ300 టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ (డోమ్ గ్రీన్ కలర్) లభిస్తాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ చేసుకున్న వారికి ‘ఎర్లీబడ్ సేల్’ కింద రూ.4,299 వరకూ బెనిఫిట్ లభిస్తుంది.
రియల్మీ నార్జో 70 ప్రో (Realme Narzo 70 Pro) ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 2200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ గల ఈ ఫోన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
రియల్మీ నార్జో 70 ప్రో (Realme Narzo 70 Pro) ఫోన్.. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 5.1 వర్షన్‌పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ హ్యానిక్స్ హెచ్ఐ634క్యూ సెన్సర్ కెమెరా ఉంటుంది. రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది.