Realme C67 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ సీ67 5జీ ఫోన్ గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ సీ సిరీస్‌లో ఇదే తొలి 5జీ స్మార్ట్ ఫోన్. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్, ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తోందీ ఫోన్. సన్నీ ఒయాసిస్ డిజైన్ స్ఫూర్తితో మినీ క్యాప్సూల్ 2.0 కూడా ఇందులో లభిస్తుంది. రెండు కలర్ ఆప్షన్లు- డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు.
రియల్మీ సీ 67 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.13,999, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తాయి. ఈ నెల 16 నుంచి దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.2000 వరకు ఆఫర్లు లభిస్తాయి. ఈ నెల 20 నుంచి ఆన్ లైన్లో కొనుగోలు చేసే వారికి రూ.1,500 ఆఫర్ అందుబాటులో ఉంది.
రియల్మీ సీ67 5జీ ఫోన్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్లో వర్చువల్‌గా మరో 6 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో రెండు టిగా బైట్ల వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 2-మెగా పిక్సెల్ పొర్టైట్ సెన్సర్ కెమెరా కూడా వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది.
రియల్మీ సీ67 ఫోన్ 33 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఏంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. దీనికి యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటది. 29 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.