Realme 13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ 13 సిరీస్ (Realme 13 Series) ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రియల్మీ 13 సిరీస్ ఫోన్లలో రియల్మీ 13, రియల్మీ 13+, ఫోన్లు ఉన్నాయి. గత నెల 30న రియల్మీ 13 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
రియల్మీ 13 ఫోన్ 6.72 అంగుళాల ఎల్టీపీఎస్ స్క్రీన్ విత్ ఫుల్ హెచ్డ్+ రిజొల్యూషన్ కలిగి ఉంటుంది. 2.2 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు. నాలుగు ర్యామ్, నాలుగు స్టోరేజీ ఆప్షన్లలో వస్తోంది. టాప్ ఎండ్ వేరియంట్ 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4880 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని సమాచారం.
రియల్మీ 13+ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది కూడా 2 గిగా హెర్ట్జ్ కెపాసిటీ గల ఒక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. నాలుగు ర్యామ్, నాలుగు స్టోరేజీ వేరియంట్లతో వస్తోందీ ఫోన్. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ5 వర్షన్‌పై పని చేస్తాయి.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!