Realme 11 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ త్వరలో భారత్ మార్కెట్లోకి తన ‘రియల్ మీ 11 ప్రో 5జీ (Realme 11 Pro 5G)’ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. రియల్మీ 11 ఫోన్‌తోపాటు రియల్మీ 11 ప్రో, రియల్మీ 11 ప్రో+ ఫోన్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 విత్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్‌తో పని చేస్తుందని తెలుస్తున్నది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మూడు కలర్ వేరియంట్లలో లభ్యం కానున్నది. ప్రపంచంలోనే తొలి 200-మెగా పిక్సెల్ కెమెరా సెటప్ గల ఫోన్ రియల్మీ తీసుకు రానున్నట్లు సమాచారం. రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో + ఫోన్లు రెండూ సిటి ఆఫ్ రైజింగ్ సన్, సిటీ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్, స్టారీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయని తలుస్తున్నది.
రియల్మీ 11 ప్రో 8జీబీ రామ్ విత్ 256 జీబీ వేరియంట్ ఫోన్ సుమారు రూ.20 వేలు (1699 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు (1999 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ దాదాపు రూ.26 వేలు (2199 చైనా యువాన్లు) పలుకుతుంది.
రియల్ మీ 11 ప్రో + ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.24 వేలు (1999 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారుగా రూ.27 వేలు (2299 చైనా యువాన్లు), 12 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.30 వేలు (2599 చైనా యువాన్లు) పలుకుతుందని తెలుస్తున్నది.
రియల్మీ 11 ప్రో స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 13 విత్ రియల్ మీ యూఐ 4.0 స్కిన్ వర్షన్ మీద పని చేస్తాయి. ఈ ఫోన్లు 6.7-అంగుళాల ఫుల్ హెచ్ డీ + (1,080×2,412 పిక్సెల్స్) కర్వ్ డ్ డిస్ ప్లే విత్ టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్ కలిగి ఉంటాయి.
6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్సెట్తో వస్తాయి. రియల్ మీ 11 ప్రో ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 110-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో వస్తున్నది.
రియల్ మీ 11 ప్రో+ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 200-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ3 సెన్సర్ విత్ సూపర్ ఓఐఎస్ సపోర్ట్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో + ఫోన్లు రెండూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. రియల్ మీ 11 ప్రో ఫోన్ సపోర్ట్స్ 67 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, రియల్ మీ 11 ప్రో + ఫోన్ 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక అథంటికేషన్ కోసం ఇన్- డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటాయి. డ్యూయల్ లైనర్ స్పీకర్స్ విత్ హై-రెస్ ఆడియో సపోర్ట్, డ్యుయల్ మైక్రో ఫోన్స్ విత్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ కలిగి ఉంటాయి.