RBL Bank | సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్బీఎల్ బ్యాంక్ ఆఫర్.. గరిష్ఠ వడ్డీరేటు ఎంతంటే?
RBL Bank | డిపాజిట్ల ప్రోత్సాహానికి సేవింగ్స్ ఖాతాల్లో డిపాజిట్లపై గరిష్ఠంగా 6.25% వడ్డీ ఇస్తున్నట్లు ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది.
RBL Bank | మెజారిటీ ప్రజానీకం అత్యవసరాల కోసం.. అనూహ్యంగా వచ్చే ఖర్చుల కోసం ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో కొంత క్యాష్ చేతిలో ఉంచుకుంటారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వచ్చే వడ్డీ చాలా తక్కువ. అయినప్పటికీ కస్టమర్లు తమ ఖాతాల్లో డబ్బు నిల్వలు ఉంచేలా పలు బ్యాంకులు సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై అధిక వడ్డీరేటు ఇస్తున్నాయి. అటువంటి బ్యాంకుల్లో ఒకటి ఆర్బీఎల్ బ్యాంక్. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై ఈ నెల ఐదో తేదీ నుంచి గరిష్ఠంగా 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఖాతాదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఎన్ఆర్ఈ, ఎన్నార్వో సేవింగ్స్‌తో సహా అన్ని రకాల సేవింగ్స్ డిపాజిట్లపై సోమవారం నుంచి వడ్డీరేట్లు మారుస్తున్నట్లు ఆర్బీఎల్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకటించింది.
రూ. లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీరేట్ 4.25 శాతం యథాతథంగా కొనసాగుతుంది. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల్లోపు డిపాజిట్లపై 5.50 శాతం, రూ.10 లక్షల నుంచి 25 లక్షల్లోపు డిపాజిట్లపై ఆరు శాతం, రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు 6.25 శాతం వడ్డీ ఇస్తున్నది. రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల డిపాజిట్లపై 5.75 నుంచి 6.25 శాతానికి వడ్డీ పెంచింది. రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు 6.10 శాతం వడ్డీ అందిస్తున్నది.
మూడు నెలలకోసారి సంబంధిత ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ చేస్తామని ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది. ప్రతియేటా జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31న వడ్డీని ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. మూడు నెలల్లో ఆర్బీఐ కీలక రెపోరేట్ 140 బేసిక్ పాయింట్లు పెంచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

