Fixed Interest on Loans | ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్/ ఫిక్స్డ్ వడ్డీరేట్లలో ఏది బెస్ట్.. !
Fixed Interest on Loans | వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు, సానుకూల, అననుకూల పరిస్థితులను బట్టి ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారితే బెటరని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Fixed Interest on Loans | ద్రవ్యోల్బణం వల్ల గత ఏడాది మే నుంచి పలు దఫాలు ఇంటి రుణాలపై వడ్డీరేట్లు.. తదనుగుణంగా ఇండ్ల రుణాలపై ఈఎంఐలు పెరిగాయి. ప్రస్తుతం వడ్డీరేట్లు కాస్త శాంతించినా.. మున్ముందు మళ్లీ పైపైకి దూసుకెళ్లే అవకాశాల్లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ఇండ్ల రుణ గ్రహీతలు ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇటీవల వివిధ రుణాలు తీసుకున్న వ్యక్తులు ఫ్లోటింగ్ వడ్డీరేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారేందుకు వెసులుబాటు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. అయితే, ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో సానుకూల ప్రతికూల పరిస్థితులు ఏమిటో తెలుసుకుందామా..
ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేట్లలో లాభాలూ, ఇబ్బందులు ఉంటాయి. రుణ గ్రహీత ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధార పడి ఉంటుంది. ఫ్లోటింగ్ వడ్డీరేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారాలనుకున్నప్పుడు వారి ఆర్థిక పరిస్థితిని గణణీయ స్థాయిలో ప్రభావితం చేస్తుంది. గతేడాది మే నుంచి పలు దఫాలుగా ఆర్బీఐ పెంచిన రెపోరేట్ 6.5 శాతం వద్ద వచ్చి నిలిచింది. మున్ముందు ద్రవ్యోల్బణాన్ని బట్టి వడ్డీరేట్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
మున్ముందు వడ్డీరేట్లు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఇండ్ల రుణ గ్రహీతలు ఫ్లోటింగ్ వడ్డీరేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారాలని భావించవచ్చు. అలా ఫిక్స్డ్ రేటుకు మారినప్పుడు నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ పెరగవచ్చు. అది మీ నెలవారీ బడ్జెట్ మీద ఎంత ప్రభావం చూపుతుందో అంచనా వేసుకున్నాకే.. అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే ఫిక్స్డ్ వడ్డీరేట్లకు మారొచ్చు.
ఫ్లోటింగ్ వడ్డీరేట్ ఎంచుకుంటే వడ్డీరేటు హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈఎంఐ పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. ఫిక్స్డ్ వడ్డీరేటు ఎంచుకుంటే ఈఎంఐ భారం ఒక్కసారే పెరుగుతుంది. వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు ఇష్టం లేని వారు ఫిక్స్డ్ వడ్డీరేట్ కు మారిపోవచ్చు.
వడ్డీరేట్లలో అనిశ్చితి నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత కూడా రుణం కొనసాగేలా ఉంటే ఫిక్స్డ్ వడ్డీరేటుకే పరిమితం కావచ్చు. జాతీయ ఆర్థిక పరిస్థితులతోపాటు అంతర్జాతీయ పరిస్థితులు కూడా వడ్డీరేట్లలో మార్పులకు కారణం అవుతుంది. కనుక ఆయా పరిస్థితులతోపాటు వ్యక్తిగత ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకుని ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీరేట్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

