Interest Rates | ఇక రుణాలు చౌకే.. భారీగా తగ్గనున్న వడ్డీరేట్లు
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపోరేటును 125 నుంచి 150 బేసిస్ పాయింట్లదాకా తగ్గించే వీలుందని సోమవారం ఎస్బీఐ రిసెర్చ్ ఓ నివేదికను విడుదల చేసింది.
- ఈ ఆర్థిక సంవత్సరం 150 బేసిస్ పాయింట్లు దిగిరావచ్చు
- రాబోయే ఆర్బీఐ ద్రవ్య సమీక్షల్లో రెపో కోతలు
- ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక
Interest Rates | న్యూఢిల్లీ, మే 5 : రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపోరేటును 125 నుంచి 150 బేసిస్ పాయింట్లదాకా తగ్గించే వీలుందని సోమవారం ఎస్బీఐ రిసెర్చ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఇదే జరిగితే ఆ మేరకు ఆయా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా కస్టమర్లకు తక్కువ వడ్డీకే అప్పులివ్వనున్నాయి. అలాగే ఇప్పటికే తీసుకున్న రుణాలపైనా వడ్డీరేట్లు తగ్గి, ఈఎంఐ భారం దిగొచ్చే వీలున్నది.
దిగొస్తున్న ద్రవ్యోల్బణం
హోల్‌సేల్, రిటైల్ ద్రవ్యోల్బణం శాంతిస్తుండటంతో ఇన్నాళ్లూ కఠిన ద్రవ్య వైఖరిని అనుసరించిన ఆర్బీఐ.. ఇప్పుడు వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్నది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున 50 బేసిస్ పాయింట్లు తగ్గిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాబోయే ద్రవ్యసమీక్షల్లోనూ మరిన్ని కోతలుంటాయంటున్న ఎస్బీఐ.. ‘జంబో’ రేట్ కటింగ్స్కూ చాన్స్ ఉందని, ఒకేసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని కూడా చెప్తుండటం గమనార్హం. ఆహారోత్పత్తుల ధరలు శాంతించడంతో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి నెలలో 67 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.34 శాతానికే పరిమితమైంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నామినల్ జీడీపీ వృద్ధిరేటు 9-9.5 శాతంగా ఉంటుందన్న అంచనాలు సైతం వడ్డీరేట్ల కోతలకు ఉత్సాహాన్నిస్తున్నదని ‘ఇన్ఫ్లేషన్ అండ్ రేట్ కట్ ట్రాజెక్టరీ’ పేరిట ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం నుంచి వచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు.
రూపీ 85-87 శ్రేణిలో..
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాది 85-87 శ్రేణిలో ఉండవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేస్తున్నది. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూపీ తీవ్ర ఒడిదొడుకులనే ఎదుర్కొన్నది. అయితే ఇటీవలికాలంలో భారీగా పుంజుకున్నది. దీంతో 85 స్థాయికి దిగువనే మారకపు విలువ ఉన్నది. అయితే తాజా అంచనా దృష్ట్యా రాబోయే రోజుల్లో రూపాయికి మళ్లీ కష్టాలు తప్పవనిపిస్తున్నది.
బీవోబీ వడ్డీరేట్ల తగ్గింపు
బీవోబీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అరశాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. రూ.3 కోట్ల లోపు ఎంపిక చేసిన కాలపరిమితులపై మాత్రం ఈ తగ్గింపు రేట్లు వర్తించనున్నాయని పేర్కొంది. ఈ నూతన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని తెలిపింది. దీంతో ఏడు రోజుల నుంచి 10 ఏండ్లలోపు కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీరేటు 4 శాతం నుంచి 7.10 శాతం మధ్యలోకి దిగొచ్చాయి. అలాగే సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుంచి 7.60 శాతం లోపు వడ్డీరేట్లను చెల్లిస్తున్నది బ్యాంక్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

