Ratan Tata | ఆ కారు నాకెప్పటికీ ప్రత్యేకమే.. రతన్ టాటా ఆసక్తికర పోస్ట్ వైరల్..!
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. వ్యాపారవేత్తగానే కాదు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. రతన్ టాటాకు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వ్యాపారం ఇతర పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పలు పోస్టులతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Ratan Tata | రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. వ్యాపారవేత్తగానే కాదు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. రతన్ టాటాకు సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వ్యాపారం ఇతర పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పలు పోస్టులతో సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ పోస్టు చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
టాటా మోటార్స్ రూపొందించిన టాటా ఇండికా కారుపై తనకున్న ప్రేమను చాటుతూ ఓ పోస్టు పెట్టారు రతన్ టాటా. ఆ కారు పక్కన నిల్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 29 లక్షలకు పైగా లైక్స్.. వేలల్లో కామెంట్లు వచ్చాయి.
కాగా, టాటా మోటార్స్ సంస్థ 1998లో ఇండికాతో తన ప్యాసింజర్ కార్ల తయారీని ప్రారంభించింది. ఈ వాహనం ప్రారంభించిన రెండు సంవత్సరాల్లోనే అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. క్యాబ్ సర్వీసులు ప్రారంభమైన తొలినాళ్లలో ఇండికా కారునే ఎక్కువగా ఉపయోగించేవారు. ఇండికాలో విస్టా, మాంజా అనే మోడల్స్‌ను విడుదల చేసినప్పటికీ, అవి అమ్మకాల్లో పెద్దగా రాణించలేకపోయాయి. దీంతో 2018లో టాటా మోటార్స్ ఇండికా తయారీని నిలిపివేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

