IIIT-NR | రషి నయా రికార్డు : రూ. 85 లక్షల వార్షిక వేతనంతో సత్తా చాటింది..!
నయా రాయ్‌పూర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT-NR) బీటెక్ విద్యార్ధిని రషి బగ్గా ఇనిస్టిట్యూట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.
రాయ్‌పూర్ : నయా రాయ్‌పూర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT-NR) బీటెక్ విద్యార్ధిని రషి బగ్గా ఇనిస్టిట్యూట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. రూ. 85 లక్షల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్‌ను సొంతం చేసుకున్న రషి ఈ ఏడాది అధిక వేతన ఆఫర్ రికార్డులను తిరగరాసింది. ఐఐఐటీ-ఎన్ఆర్లో అత్యధిక వేతన ప్యాకేజ్‌ను సాధించి ఆమె సత్తా చాటింది.
రషి బగ్గాకు ఇప్పటికే హాట్ ఆఫర్ లభించినా జాబ్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆమె పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. దీంతో ఈ రికార్డు బ్రేకింగ్ ఆఫర్‌ను దక్కించుకుందని ట్రిపుల్ ఐటీ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు. ఈ అరుదైన ఆఫర్‌కు ముందు రషి అమెజాన్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్, బెంగళూర్‌లో ఇంట్యూట్‌లో ఎస్డీఈ ఇంటర్న్‌గా పనిచేసింది.
ఈ ఏడాది జులై నుంచి ఆమె అట్లాసియన్‌లో ప్రోడక్ట్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా సేవలందిస్తోంది. ఇక అంతకుముందు ఐఐటీ-ఎన్ఆర్ విద్యార్ధిని చింకీ కర్దా గత ఏడాది ఇదే కంపెనీ నుంచి రూ. 57 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ పొందారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక ఆఫర్ కాగా రషి బగ్గా ఆ రికార్డును బ్రేక్ చేశారు. 2020లో ఐఐఐటీ-ఎన్ఆర్ విద్యార్ధి రవి కుష్వహకు ఓ మల్టీనేషనల్ కంపెనీ ఏకంగా రూ. కోటి వార్షిక వేతనంతో జాబ్‌ను ఆఫర్ చేసినా కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ డీల్‌ను అందుకోవడం సాధ్యం కాలేదు.
Read More :
IIT Kanpur | ఐఐటీ కాన్పూర్‌లో రెండు జట్ల మధ్య ఘర్షణ.. కుర్చీలతో కొట్టుకున్న ఆటగాళ్లు.. VIDEO
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

