న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మొబిలిటీ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ ర్యాపిడో తాజాగా ఫుడ్ డెలివరీ సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే బెంగళూరులో ఈ సేవలను ఆరంభించిన సంస్థ.. శుక్రవారం హైదరాబాద్‌లో ‘ఓన్లీ’ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ర్యాపిడో యాప్‌తోపాటు ఓన్లీని ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లోనూ డౌన్లోడ్ చేసుకుని ఫుడ్ ఆర్డర్ చేయవచ్చునని కంపెనీ కో-ఫౌండర్ అరవింద్ తెలిపారు. కాగా, ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరి కాకుండా ఓన్లీ.. జీరో కమీషన్ మాడల్‌ను అనుసరిస్తున్నట్టు చెప్పారు.