హైదరాబాద్, జూలై 21: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్‌కు చెందిన అనుబంధ సంస్థయైన రేంజ్ రోవర్..మరో మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. రేంజ్ రోవర్ వెలార్ ఆటోబయోగ్రఫీ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ రూ.89.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. అలాగే రూ.84.90 లక్షల ప్రారంభ ధర కలిగిన రేంజ్ రోవర్ వెలార్ డైనమిక్ ఎస్ఈని కూడా పరిచయం చేసింది.
పానరోమిక్ సన్‌రూఫ్, మెరిడాన్ 3డీ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ కలిగిన ఈ మాడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో రూపొందించింది. 20 ఇంచుల టచ్‌స్క్రీన్, పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.