హైదరాబాద్, మార్చి 20: రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రాంకీ ఇన్ఫ్రాకు రూ.217 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వీటిలో రూ.39.88 కోట్లు ఆర్డర్, రూ.176.77 కోట్ల విలువైన రెండు ఆర్డర్లు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నుంచి లభించినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.