Akasha with Boieng | స్టాక్ మార్కెట్ బుల్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తన విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయనున్నారు. వీటి విలువ 900 కోట్ల డాలర్లు ఉంటుంది. భారత్ విపణిలోకి శరవేగంగా దూసుకెళ్లాలని ఆకాశ ఎయిర్ భావిస్తున్నది.
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబె ఈ సందర్భంగా మాట్లాడుతూ బోయింగ్‌తో భాగస్వామి అయినందుకు తాము సంతోషంగా ఉందన్నారు. తొలి విమానాల కొనుగోలు ఆర్డర్ చేయడంతోపాటు ఆశాక ఎయిర్ బిజినెస్ ప్లాన్ పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నందుకు బోయింగ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్‌ను అందుకునేందుకు బోయింగ్ 737 విమానాలను వినియోగించాలని ఆకాశ ఎయిర్ ప్లాన్ చేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ తొలి విమానం వచ్చే ఏడాది డెలివరీ కానున్నది. వచ్చే ఏడాది వేసవిలో విమానయాన సేవలను ఆకాశ ఎయిర్ ప్రారంభించనున్నది.