Radhika Merchant | ఇషా అంబానీ ఇంట రోమన్ హోలీ వేడుక.. రాధికా మర్చంట్ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Radhika Merchant | ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ‘ఎ రోమన్ హోలీ’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు (A Roman Holi Event) బాలీవుడ్ తారలంతా హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో అంబానీ ఇంటికి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Radhika Merchant | చిన్నదైనా.. పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లలో జరిగే ప్రతి వేడుకా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత చిన్న వేడుకైనా సరే చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ‘ఎ రోమన్ హోలీ’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు (A Roman Holi Event) బాలీవుడ్ తారలంతా హాజరై సందడి చేశారు. డిజైనర్ వేర్స్, ట్రెండీ జ్యువెలరీతో సందడి చేశారు.
అయితే ఈ వేడుకల్లో అంబానీ ఇంటికి కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుక ఏదైనా రాధిక అందుకు తగ్గట్టు డ్రెస్సులో మెరుస్తూ ఉంటుంది. ఈ వేడుకల్లో కూడా శాటిన్ డ్రెస్‌లో అందరినీ ఆకర్షించింది. నయీమ్ ఖాన్ గోల్డ్ ఆర్మీరీ జోడియాక్ క్లచ్ నెక్లెస్ ధరించి సింపుల్ మేకప్‌తో ఎంతో అందంగా కనిపించింది. దీంతో పార్టీలో అందరి దృష్టి ఆమెపైనే పడింది.
ఇక ఈ వేడుకలో రాధిక ధరించిన డ్రెస్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఆ డ్రెస్ ఖరీదు ఎంతనుకుంటున్నారు.. అక్షరాలా రూ.6.4 లక్షలు అని తెలిసింది. ఇక రాధిక ధరించిన నెక్లెస్ ఖరీదు రూ.1.67 లక్షలట. ఇది తెలుసుకున్న ఫ్యాషన్ ప్రియులు అంబానీ కోడలా మజాకానా.. రేంజ్‌కు తగ్గ డ్రెస్సే ధరించింది అంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఇదే వేడుకలో ఇషా అంబానీ ప్రత్యేక డిజైనర్ గౌనులో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్‌ను డిజైన్ చేసేందుకు ఏకంగా 100 గంటలు పట్టిందట. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. పలువురు తారలు కూడా పార్టీకి తగ్గట్టు డ్రెస్సులో మెరిసి సందడి చేశారు.
Also Read..
Arundhathi Nair | రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోనీ హీరోయిన్.. వెంటిలేటర్‌పై చికిత్స
Indian student | అమెరికాలో హత్యకు గురైన తెలుగు విద్యార్థి.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన..!
Cheetah cubs | ఐదు కాదు.. ఆరు కూనలకు జన్మనిచ్చిన దక్షిణాఫ్రికా చిరుత గామిని
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

