Arundhathi Nair | రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోనీ హీరోయిన్.. వెంటిలేటర్‌పై చికిత్స
Arundhathi Nair | ప్రముఖ తమిళ, మలయాళ నటి అరుంధతి నాయర్ (Arundhathi Nair) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు (road accident). ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
Arundhathi Nair | ప్రముఖ తమిళ, మలయాళ నటి అరుంధతి నాయర్ (Arundhathi Nair) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు (road accident). మార్చి 14వ తేదీన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం సోదరుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అయితే, ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని నటి సోదరి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అరుంధతి ప్రాణాలతో పోరాడుతోందని, వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఈ న్యూస్‌ను షేర్ చేసుకుంది. ‘వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానెల్స్‌లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. మా సోదరి అరుంధతి నాయర్‌కు మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. ఈ ప్రమాదంలో అరుంధతి తీవ్రంగా గాయపడింది. తిరువనంతపురంలోని అనంతపురి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. వైద్యులు ఆమెకు వెంటిలేటర్ (Ventilator)పై చికిత్స అందిస్తున్నారు’ అని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు అరుంధతి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, అరుంధతి 2014లో ‘పొంగి ఎజు మనోహరా’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ‘సైతాన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2018లో ‘ఒట్టకోరు కాముకన్’తో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అరుంధతి చివరిగా 2023లో ‘ఆయిరం పోర్కాసుకల్’ అనే తమిళ చిత్రంలో కనిపించింది.
Also Read..
Aadu Jeevitham | నేను కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు : మోహన్ లాల్
RRR composer | ఆర్ఆర్ఆర్ కంపోజర్ హిందీ సినిమా.. వివరాలివే
Prithviraj Sukumaran | వెయిట్ చేయలేకపోతున్నా.. అక్షయ్ కుమార్‌తో ఫైట్‌పై పృథ్విరాజ్ సుకుమారన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

