ముంబై, సెప్టెంబర్ 10: జర్మనీకి చెందిన లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆడీ..ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని క్యూ7ను లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రవేశపెట్టింది. బారీక్యూ బ్రౌన్ కలర్‌తో తయారైన ఈ మోడల్ కేవలం 50 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నది.
ఈ కారు ధర రూ.88.08 లక్షలు. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. కేవలం 5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.